SOPs & Protocols

Section 1 - Standard Operating Procedures (SOP)

A. State Level

AHTU Telangana SOP 

FIR నమోదు ముందు చర్యలు

 • అక్రమ రవాణాదారు గురించి ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సమాచార సేకరణ
 • అనుమానితులను కూలంకషంగా/ లోతుగా విచారించటం – ఒక లింక్ ను అనుసరిస్తే మరొక లింక్ లభించవచ్చు
 • అక్రమ రవాణాదారుల గురించిన వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించి సమాచారాన్ని ఇతర సంబంధిత సంస్థలతో పంచుకోవటం
 • సమాచారం అందించే సంస్థలు / వ్యక్తులు
 • రవాణా సంస్థలు , పర్యాటక ప్రదేశాలకు టూర్ లు ఏర్పాటు చేసే వ్యక్తులు
 • ఇమ్మిగ్రేషన్ ఏజంట్లు
 • పెళ్లిళ్లు కుదిర్చే సంస్థలు హోటళ్లు
 • మసాజ్ చేసే దుకాణాలు/ ప్రదేశాలు
 • ఎస్కార్ట్ సేవలు
 • చట్టవిరుద్ధమైన అబార్షన్ (గర్భవిచ్చేదన) క్లినిక్ లు
 • ఇంటర్-నెట్ సెంటర్లు

ముందస్తు రెస్క్యూ ప్రణాళిక తయారు చెయ్యటం

  • సమాచారం అందిన వెంటనే తక్షణ చర్య తీసుకోవలసి ఉంటుంది.
  • సమాచారం యదార్థమా కాదా నిర్ధారించుకోవటం
  • ఆపరేషన్ చర్యలో ఏ శాఖలను చేర్చాలో నిర్ణయించుకోవడం
  • ఎప్పుడు,ఎక్కడ, ఎలా ఆపరేషన్ నిర్వహించాలో ఆలోచించటం
  • ఎంత మందిని కాపాడే అవకాశం ఉంది.
  • ఎంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అవసరమైన చట్ట,శాసనపరమైన
  • అనుమతులు పొంది ఉండటం ఆహరం, బట్టలు , మందులు ,డబ్బు మొదలైన అవసరాల గురించి తయారుగా ఉండటం
  • అనుకోని పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ప్రణాళికలు.
  • రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు.

FIR నమోదు చెయ్యక ముందు రెస్క్యూ చర్య

  • సోర్స్ (సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో) ని GD లో చేర్చి, చేర్చినప్పుడు బాధితులు , స్థలం , సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచటం.
  • సోదా చేసే ముందు ఆ స్థలంలో రెక్కీ నిర్వహించటం. ఆ స్థలం మ్యాప్ తయారు చేసుకుని బృందంతో చర్చించుకోవాలి.
  • ఆ స్థలం చుట్టుముట్టటానికి, లోపలికి, బయటకు వెళ్లే మార్గాలపై నిఘా , రహస్య స్థలాలను కనిపెట్టటం కోసం మ్యాప్ పనికి వస్తుంది.
  • అవసరమైతే సెర్చ్ వారంట్ తీసుకోవటం.
  • రెస్క్యూ బృందంలో సరైన వ్యక్తులను ఎంచుకోవటం:
  • బృందంలో ఏ స్థాయి వారైనా,ఇద్దరు మహిళా అధికారులు ఉండవలసి ఉంటుంది.
  • రెస్క్యూ చేశాక బాధితులను మహిళా అధికారి ఇంటర్వ్యూ చెయ్యవలసి ఉంటుంది. లేదా ఎన్జీఓ కి చెందిన మహిళా ప్రతినిధి సమక్షంలో జరగవలసి ఉంటుంది.
  • సాక్ష్యం కోసం ఎన్జీఓల సహాయసహకారాలు తీసుకోవటం.
  • బాధితులను నిందితులను వేరు చేసి తీసుకువెళ్ళటానికి తగినన్ని వాహనాలు సిద్ధం చెయ్యటం.
  • బాధితుల వెంట ఉండటానికి సిబ్బందిని ఏర్పాటు చేయటం.
  • సాక్ష్యాధారాలు సేకరించటానికి, దస్తావేజులకు అవసరమైన కాగితాలు , పెన్నులు మొదలైనవి సిద్ధం చేసుకోవటం.
  • సంబంధిత అధికారులకు ఆపరేషన్ జరిపే స్థలం, సమయం తెలియపరచటం. ఆపరేషన్ జరిగే స్థలం దగ్గరలో ఉన్న రెస్క్యూ హోమ్స్ కి ముందస్తుగా తెలియ చెయ్యటం. రెస్క్యూ ‘తక్షణమే’ నిర్వహించటం.
  • CWC ముందు హాజరు పరచవలసి ఉంటుంది కాబట్టి బాధితులలో పిల్లలను గుర్తించటం.
  • కాపాడిన బాధితులందరి భద్రత కోసం, వారికి భరోసా కల్పించడానికి చర్యలు తీసుకోవటం
  • నిందితులను, బాధితులను విడిగా ఉంచటం.
  • బాధితుల వస్తువులను వారి వద్దనే ఉంచుకోనివ్వాలి.
  • రెస్క్యూ చేసిన స్థలం నుండి కీలకమైన పత్రాలు, వస్తువులు మొదలైనవి స్వాధీనం చేసుకోవటం.

FIR నమోదు

  • FIR లో ITPAకి సంబంధించిన సెక్షన్లు ఉదహరించడం.
  • ITPA మాత్రమే గాక IPC సెక్షన్లు 366ఏ , 366బి , 372, 373, 375, 376,377, 120ఏ ,120 బి , 416, 417, 339, 340A, 341, 342, మొదలైనవి కేసు ని బట్టి చేర్చటం.
  • JJ చట్టం (67 సెక్షన్) వంటి ప్రత్యేక నిబంధనలు కూడా చేర్చటం
  • దర్యాప్తులో ఇతర నేరాలు బయటపడితే IO వాటికి సంబంధించిన చట్టనిబంధనలను అదనపు మెమోలుగా చేర్చి కోర్టులో దాఖలు చెయ్యటం.

దర్యాప్తు

  • సాక్ష్యాధారాలకు పనికివచ్చే వస్తువుల సేకరణ
   • వ్యభిచారగృహంలో దొరికిన డైరీలు , అక్కౌంట్ పుస్తకాలు , రిజిస్టర్లు వగైరా.
   • బస్సు ,రైలు , విమానం టిక్కెట్ల వంటి ప్రయాణ పత్రాలు అద్దె రసీదులు , అగ్రీమెంట్లు , రేషన్ కార్డులు ,పాస్ పోర్టులు , డ్రైవింగ్ లైసెన్సులు మొదలైనవి ఏవైనా వ్యభిచారగృహం చిరునామా , నడుపుతున్నట్లు రుజువుకి ఉపయోగపడేవి.
   • బాధితులను లైంగికంగా దోపిడీ చేస్తున్నారని రుజువు చేసే ఆసుపత్రి బిల్లులు , మందుల బిల్లులు ,మందులు , డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ , గర్భ నిరోధక తొడుగులు , మాత్రలు , బాధితులకు అబార్షన్ జరిగినట్లు ఆసుపత్రి రికార్డులు ,అశ్లీల సాహిత్యం , బొమ్మలు అలంకరణ సామాగ్రి మొదలైనవి.
   • ఒక నేర సంస్థగా , లైంగిక దోపిడీ చేస్తూ నడుపుతున్నట్లు రుజువు చేసే ఆల్బమ్ లు , వీడియోలు , అశ్లీల సామాగ్రి, కంప్యూటర్లు , హార్డ్ డిస్కులు , ప్రచార పుస్తకాలు తదితరాలు.
   • బాధితులను ఇతర స్థలాలకు తీసుకుపోయే వాహనాల వివరాలు దోపిడీ జరిగే ప్రదేశాల సమాచారం కోసం రుజువులుగా పనికివస్తాయి.
   • వ్యభిచారగృహానికి వచ్చేపోయే వారి లిస్టులు , వారి జాబితాలున్న పుస్తకాలు – లైంగిక దోపిడీ జరుగుతున్నట్లు ఋజువులుగా పనికి వస్తాయి.
  • సోదా
    • MO వస్తువులను ఘటనాస్థలం నుండి పంచనామా ద్వారా సేకరించాలి.
  • నిందితుల/ముద్దాయిల విచారణ
   • విచారణ చేసేటప్పుడు ఇన్కమ్ టాక్స్ వంటి ఆర్థిక శాఖలు , కార్మిక శాఖ, ఇమ్మిగ్రేషన్ వంటి ఇతర శాఖల సహకారం తీసుకోవటం.
   • శాస్త్రీయ పద్ధతులలో విచారణ చేయటం.
   • విచారణ సమయంలో అరెస్టైన వ్యక్తి బాధితుడిని బయట పడితే ఆ వ్యక్తిని బాధితుడిగానే పరిగణించాలి గాని బాధకు గురి చేయకూడదు
  • నిందితుల అరెస్టు
   • సెక్షన్ 51(2), 100(3) ల ప్రకారం మహిళా నేరస్థులను మహిళా పోలీస్ సిబ్బంది మాత్రమే సోదా చెయ్యాలి.
   • నిందితులకు వైద్య పరీక్ష కూడా చేయించాలి.
   • అరెస్టు చేసే ముందు, అరెస్టు తరువాత నేరస్థుల సెల్ ఫోన్లలో సందేశాలను , నంబర్లను గమనించటం వల్ల అక్రమ రవాణా నేరస్థుల లింక్ లు , మరెన్నో అరెస్టులు చేయటానికి అవకాశం లభిస్తుంది.

FIR నమోదు తరువాత రెస్క్యూ చెయ్యటం

  • FIR నమోదు చెయ్యటానికి ముందు రెస్క్యూ చర్య నిర్వహించటంలో పాటించే నియమాలన్నీ ఇక్కడ కూడా పాటించవలసి ఉంటుంది.
  • అదనంగా ఈ విషయాలు కూడా :దర్యాప్తు అధికారి ,IO జరిగేవన్నీ CDలో రికార్డు చెయ్యటం.
  • సెక్షన్ 161 కింద వాంగ్మూలాలు రికార్డ్ చెయ్యటం. మెమోలు అన్నిటి పైన FIR తేదీ , నంబరు ఉండేటట్లు చూసుకోవాలి

రెస్క్యూ చేసిన తరువాతి కార్యకలాపాలు

  • వాంగ్మూలం రికార్డు చెయ్యటం
  • శిక్షణ పొందిన కౌన్సెలర్ ద్వారా కౌన్సెలింగ్ జరిపించాలి .
  • వయసు నిర్ధారణ:
  • బాధితుల వయసు నిర్ధారణకు సంబంధించిన అధికారిక పత్రాలను దర్యాప్తు అధికారి /IO సంపాదించాలి. ( జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ సర్టిఫికెట్ , ఆధార్ కార్డు, రేషన్ కార్డు వగైరా)
  • బాధితులను వయసు ధృవీకరించటానికి IO ఫోరెన్సిక్ వైద్య శాఖకు పంపటం.
  • బాధితుల వయసు నిర్ధారణకు పొరుగువాళ్ళు , ఇతర బాధితులు మొదలైన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం సేకరించాలి.
  • బాధితుల వయసు విషయంలో సందేహం, వివాదం ఏదైనా ఉంటే ఆ కేసును IO మెడికల్ బోర్డుకు తెలియపరచటం.
  • బాధితులను CWC /మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచటం.
  • వయోజనులైన బాధితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచటం.
  • బాధితులైన బాలలను CWC ముందు హాజరు పరచటం.
  • ఎవరూ లేని బాధితులను షెల్టర్ కోసం ప్రభుత్వ లేదా ఎన్జీఓ సంస్థలు నడిపే హోమ్ లకు పంపటం.
  • పైన చెప్పినవేవీ అందుబాటులో లేకపోతే పోలీసు అధికారి చొరవతో బాధితులకు వసతి కల్పించాలి.
  •  

బాధితులు వైద్య సహాయం

 • బాధితులకు వైద్య పరీక్ష జరిపే ముందు వారికి జరగబోయేది తెలియపరచి అనుమతి తీసుకోవటం చట్టరీత్యా అవసరం.
 • బాధితుల వెంట మహిళా పోలీసు ఉండటం అవసరం
 • ఎన్జీఓ ఉండటం కూడా ఉండటం..
 • బాధితులు తాగుడు, మాదక ద్రవ్యాలు మొదలైన వాటికి బానిసలైతే వారిని డి-ఎడిక్షన్ చికిత్సా కేంద్రాలకు పంపటం.

బాధితులను ఇల్లు చేర్చటం

 • హోమ్ వెరిఫికేషన్ జరిగిన తరువాత బాధితులను సరైన వ్యక్తులకు మాత్రమే అప్పజెప్పటం.
 • బాధితులు హోమ్ లలో చేరే సమయంలో వారికి సరైన భద్రతనివ్వటం.
 • పోలీసులు పిల్లలు బాధితులు అయితే సరైన తల్లిదండ్రులకు మాత్రమే సంరక్షణ అప్పజెప్పవలసి ఉంటుంది

ఇంటి ధృవీకరణ

 • మానవ అక్రమ రవాణా అరికట్టటానికి పని చేస్తున్న ఎన్జీవోల పట్టిక /లిస్టు మేజిస్ట్రేట్ కి ఇవ్వటానికి సిద్ధం చేసుకోవటం

ఛార్జ్ షీట్

 • ఛార్జ్ షీట్ అనేది నేరం నిరూపించటానికి అత్యంత అవసరమైన పత్రం. మానవ అక్రమ రవాణా అనేది ప్రణాళిక ప్రకారం చేసే నేరం కాబట్టి CD లో నేరం – నేరస్థుడు – ఋజువు, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెలియచెయ్యటం
 • ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యటానికి న్యాయవాది అభిప్రాయం తీసుకోవటం
 • ఈ నిపుణుల రిపోర్టులు అన్నీ సేకరించి సిద్ధం చేసుకోవటం:
 • బాధితుల మెడికల్ రిపోర్టు . వారి మెడికల్ హిస్టరీ , సుఖవ్యాధులు , లైంగిక శోషణ గురించి సమాచారం.
 • వయసు నిర్ధారణ
 • మానసికంగా అనుభవిస్తున్న వేదన/ బాధ గురించి నిపుణుల అభిప్రాయం
 • సెక్షన్ 25 IEA ప్రకారం నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం కాపీలు

విచారణ

 • న్యాయవాదులకు /లాయర్లకు కేసు గురించిన వాస్తవాలు మాత్రమే గాక బాధితుల వేదన , నేరస్థుల మధ్య లింకులు, వారి ప్రణాళికల గురించి తెలియజెయ్యటం.
 • కోర్టులో సాక్ష్యం ఇవ్వటానికి కౌన్సెలర్ , ఎన్జీవోల సాయంతో బాధితులను సిద్ధం చెయ్యటం
 • సాక్షులను సిద్ధం చెయ్యటం
 • విచారణ సమయంలో బాధితుల / సాక్షుల భద్రత విషయంలో అప్రమత్తత

నిపుణుల సహాయ ప్రక్రియ

 • ఈ ప్రక్రియ లక్ష్యం బాధితుల పునరావాసం. ఆరోగ్య సమస్యల కోసం , మానసిక సమస్యల కోసం వైద్యుల దగ్గరకు, ఊరట కోసం కౌన్సెలర్ల దగ్గరకు, న్యాయసహాయం, నష్టపరిహారం వంటి పునరావాస చర్యల ప్రక్రియ.
 • ఈ విషయమై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రక్రియ:
 • G.O Ms No.09, dt:07.03.2018 of Law(LA.LA&J-Home Court.B) , తెలంగాణా ప్రభుత్వ GO ప్రకారం అక్రమ మానవ రవాణా బాధితులకు WCD (స్త్రీ శిశు సంక్షేమ శాఖ) ద్వారా రాష్ట్ర న్యాయసేవా అథారిటీ ఇచ్చే నష్ట పరిహారం
 • ఈ పరిహారం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఇవ్వటానికి మంజూరు చేసింది.

నివారణ

 • నేరస్థులపై చట్టపరంగా దాడి చేసి వారిని కటకటాలలో పెట్టటం.
 • మళ్ళీ అక్రమ రవాణాకు గురి కాకుండా ఉండటానికి బాధితులకు సరైన పునరావాసం కల్పించటం.
 • అక్రమ రవాణా జరిగే ముఖ్య స్థలాలలో ఇతర సంస్థలతో కలిసి నేరం గురించి అవగాహన కల్పించి , ప్రచారం చేసి నేరాన్ని అరికట్టడం.
 • రైల్వే , బస్ స్టాప్ ల వంటి ప్రయాణ మజిలీ ప్రదేశాలలో గట్టి బందోబస్తు , నిఘా ఉంచి అప్రమత్తంగా ఉండి నేరాన్ని అరికట్టడం.
 • అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలలో అపరిచితుల కదలికల మీద నిఘా.
 • హైవేలు (రహదారులు) ,ధాబాలు ,బస్సు ,రైల్వే స్టేషన్లు వంటి చోట్ల బాధితులను వెంట తీసు

Section 2 - International Instruments

International Conventions for the Suppression of the Traffic is Persons and of the Exploitation of the Prostitution of others, 1949 (Signed by India on May 9, 1950)

The Convention on Consent to Marriage, Minimum Age for Marriage and Registration for Marriages- Convention enforced with effect from 9th December 1964

The United Nations Standard Minimum Rules for the Administration of Juvenile Justice (Beijing Rules) 1985, adopted by the United Nations General Assembly in November 1985.

The Convention on the Rights of the Child (CRC), 1989 adopted on 2nd Sep 1990 (India ratified in November 1992)

United Nations Guidelines for the Prevention of Juvenile Delinquency (The Riyadh Guidelines), 1990, adopted by the General Assembly in December 1990, complement the previously adopted Beijing Rules.

The Declaration on the Elimination of Violence Against Women, 1993

The International Convention concerning the Prohibition and Immediate Action for the Elimination of the Worst Forms of Child Labour (ILO Convention 182), 1999- Convention enforced with effect from 19th November 2000.

The International Convention concerning the Prohibition and Immediate Action for the Elimination of the Worst Forms of Child Labour (ILO Convention 182), 1999- Convention enforced with effect from 19th November 2000.

The Protocol to Prevent, Suppress and Punish Trafficking in Persons, Especially Women and Children (Trafficking Protocol), 2001.

The Optional Protocol on the sale of children, Child prostitution and child pornography, 2000- UN adopted on 18th January 2002