(ఈ స్కీం కింద 254 ప్రాజెక్ట్స్, 134 రీహాబిలిటేషన్ హోమ్స్ ఈ దేశంలో ఉన్నాయి. దీని వల్ల లాభ పడిన వారి సంఖ్య :5,291. Source: Press Information Bureau, 2019.
https://wcd.nic.in/sites/default/files/Ujjawala%20New%20Scheme.pdf
WCD మంత్రివర్గం స్వధార్ గ్రిహ్ ప్రోగ్రాం కింద బడ్జెట్ 500 మిలియన్ ($7.37మిలియన్) నించి 900 మిలియన్ ($13.3మిలియన్) వరకు. 200 షెల్టర్లలో 15,000 కి పైగా ఆడపిల్లలను మరియు అమ్మాయిలని చాలా కష్టమైన పరిస్థితుల్లో నుంచి (అక్రమ రవాణా లాంటి) రక్షించారు. ప్రస్తుతం, ఈ ప్రోగ్రాం కింద దేశ వ్యాప్తంగా 551 గృహాలో 16,530 మంది లాభపడ్డారు(annexure 3). ఈ ప్రోగ్రాం ప్రకారం, ప్రతి జిల్లాలో 30 మంది బాధితులు ఉంటే షెల్టర్ హోమ్ పెట్టొచ్చు.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ స్కీంను లాంచ్ చేసింది, ఇందులో, స్టేట్ గవర్నమెంట్ కాష్ రిహాబిటేషన్ కొరకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్ధిక మద్దతుINR 20,000 నించి INR 1,00,000 వరకు , పురుష లబ్దిదారులకు, 2,00,000 వరకు, ప్రత్యేక పిలల్ల విభాగం(అనాధలతో సహా) లేదా యే మహిళా లబ్ధిదారులకు పెంచబడింది.
వెట్టి చాకిరి చేసే కార్మికులు ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ నించి వచ్చినవారికి వేధింపులకి గురి అయ్యే అవకాశము ఉంటుంది కావున వారికి 3 లక్షల మద్దతు వస్తుంది.
కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక ఫార్ములేటేడ్ అంబ్రెల్లా స్కీం – ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం తయారు చేసింది. ఈ స్కీం, చట్టంతో విభేదాలు ఉన్న పిల్లలు మరియు క్లిష్ట పరిస్థుతులలో ఉన్న పిల్లల యొక్క పూర్తి పెరుగుదల, వారు క్షేమంగా మరియు సురక్షితంగా జరగాలి అన్న కోణంలో చూస్తుంది. దీని యొక్క బడ్జెట్ కేటాయింపు ICPS కింద XIIప్లాన్ పీరియడ్లో 2350 కోట్లు. ఈ స్కీం కింద 77,508 మంది లబ్దిపొందారు మరియు 36 రాష్ట్రాలు MoU’s సంతకం చేశాయి.
ఈ స్కీం 14 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సు ఉన్న బాల కార్మికులను రక్షించి, పునరావాసం కల్పించి, వారికి చదువు చెప్పించటం కోసం, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ NCLP మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కీంలో 280 జిల్లాలు, 3234 స్పెషల్ సెంటర్లు మరియు 1,22,843 మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. ఈ స్కీం యొక్క వార్షిక (2016-17) వ్యయం 105 కోట్లు.
ఈ స్కీం ప్రకారం, ఈ దేశంలో సామూహిక అత్యాచారానికి గురైన భాదితులరాలు/డు కనీస పరిహారం, 5 నుంచి 10 లక్షలు. అదే విధంగా , అత్యాచారం లేదా అసహజ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి/డికి కనీసం నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల వరకు పరిహారం.