సారాంశం: ఏ విధమైన అసభ్య మైన కామ పూరిత సమాచారాన్ని (ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ) పంపించడానిని శిక్షిస్తుంది మరియు పోర్నోగ్రఫీ సమస్యను కూడా ఎదుర్కొంటుంది
SECTION 67A:లైంగిక సంబంధించిన ప్రచురణ లేదా ట్రాన్స్మిషన్ ను ఎలక్ట్రానిక్ గా పెట్టడాన్ని శిక్షిస్తుంది.
SECTION 68B:పిల్లలు లైంగిక వేదింపులకు గురౌతున్న దృశ్యాలను ఎలక్ట్రానిక్ గా పెట్టడాన్ని శిక్షిస్తుంది .
సారాంశం: కేంద్ర మాతా శిశు సంక్షేమ మంత్రి వర్గం పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు మరియు అత్యాచారాలను అరికట్టడానికి POCSOను మొదలుపెట్టింది.
బాలలపై పెనైట్రేటివ్ లైంగిక వేధింపు / అత్యాచారం జరిగితే (section 3) – కనీసం 10 ఏళ్ళ జైలు శిక్ష నించి జీవిత ఖైదు మరియు జరిమానా .
(section 4)ఆగ్రవేటడ్\ పెనైట్రేటివ్ లైంగిక వేధింపు(section5) – కనీసం 20 ఏళ్ళ జైలు శిక్ష నించి జీవిత ఖైదు మరియు జరిమానా.(section6)
లైంగిక వేధింపు అంటే పెన్ట్రేషన్ లేకుండా లైంగిక సంపర్కం(section7)-కనీసం 3 ఏళ్ళ జైలు శిక్ష నించి 5 ఏళ్ళ ఖైదు మరియు జరిమానా.(section 8)
అధికారంలో ఉన్న వ్యక్తిచే ఆగ్రవేటడ్ లైంగిక వేధింపులకు గురైతే (section 9) – కనీసం 5 ఏళ్ళ జైలు శిక్ష నించి 7 ఏళ్ళ ఖైదు మరియు జరిమానా.
(section 10)పిల్లలపై లైంగిక వేధింపు(section 11) – 3 ఏళ్ళు జైలు శిక్ష మరియు జరిమానా (section 12).
పిల్లల్ని పోర్నోగ్రఫీ కొరకు ఉపయోగించుకోవటం(section 14)- మొదటిసారి పట్టు బడితే 5 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరిమానా , మళ్ళీ పట్టుబడినచో 7 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరిమానా(section 14(1)). *
సారాంశం పిల్లలచే పనిచేయించుకోవటం మరియు కౌమారదిశలో ఉన్న వ్యక్తులతో ప్రమాదకరమైన ఉద్యోగాలను చేయించటం ఈ చట్టం ప్రకారం నిషేధం
ఈ చట్టం ప్రకారం ఎవరైనా పిల్లలని కాని , కౌమారదశలో ఉన్న వారి చేత కానీ పనిచేయించుకున్నా లేదా పనిచేయటానికి ఆనుమతించినా కనీసం 6నెలల నించి 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష లేదా ఇరవైవేల నించి యాభైవేల వరకు జరిమానా లేదా రెండూ పడవచ్చు.
ఇదే నేరంపై మళ్ళీ పట్టుబడినచో 1-3 ఏళ్ళవరకు జైలు శిక్ష పడచ్చు.
పిల్లల యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఈ చట్టంలో చెప్పబడిన నిబంధనలను పాటించకపోతే వారికి శిక్షపడుతుంది.
సారాంశం: ఈ బిల్లు అన్ని విధముల అక్రమ రవాణాల కొరకు, భాదితుల యొక్క రెస్క్యూ,ప్రొటెక్షన్ మరియు రిహాబిలిటేషన్ కొరకు చట్టం తెస్తుంది.
ఈ బిల్లు కింద ఒక యజమానికి కానీ అద్దెకిచ్చిన వ్యక్తికి కానీ ఆ ప్రదేశంలో అక్రమ రవాణా జరుగుతోందని ముందే తెలిసి ఉన్నచో శిక్షింపబడతాడు.ఈ బిల్లు ప్రకారంగా యజమాని కానీ అద్దెకిచ్చిన వ్యక్తి కానీ వారి అమాయకత్వము నిరూపించుకునేదాకా దోషులగానే పరిగణించబడతారు. ఇది ఆర్టికల్ 21 ని ఉల్లంఘించచ్చు.
ఈ బిల్లు ప్రకారం ఏ వ్యక్తి అయినా అక్రమ రవాణా కి సంబంధించిన పదార్ధాన్ని కాని నివేదికను కాని ప్రచురిస్తే ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది.
ఈ బిల్లు అక్రమ రవాణాలోని విధాలను ‘ఆగ్రవేటడ్’ కింద విభజిస్తుంది, దీని వల్ల శిక్షలు అధికం కావచ్చూ.కాబట్టి, కొన్ని ఆగ్రవేటడ్ నేరాలకు ఉదాహరణకి, భిక్షం అడగటం వంటి నేరానికి బానిసత్వం కంటే ఎక్కువ శిక్ష పడుతుంది.